పాన్ ఆధార్ కార్డు లింక్ కొత్త రూల్స్ ఇవే … ఈ అప్డేట్స్ తెలుసుకోక పోతే భారీగా నష్ట పోతారు

Posted by


పాన్ కార్డ్‌హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం గత నెలలో ఊరట ప్రకటించింది. పాన్-ఆధార్ నంబర్ అనుసంధానం గడువు ఈ ఏడాది జూన్ 30వ తేదీ వరకు పొడిగించింది.

ఇది కాకుండా, తాజాగా మరో అప్‌డేట్ కూడా వచ్చింది. ఒకవేళ మీరు మీ పాన్-ఆధార్ లింక్ అనుకుంటే, ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలి.

పాన్-ఆధార్ లింకింగ్ అప్డేట్ మీ పాన్-ఆధార్ను లింక్ చేస్తున్నప్పుడు, రూ. 1000 ఆలస్య రుసుమును చెల్లించే ముందే మీరు తప్పనిసరిగా మదింపు సంవత్సరం లేదా అసెస్‌మెంట్ ఇయర్ను (AY) ఎంచుకోవాలి. ఆదాయపు పన్ను విభాగం కొత్తగా ఈ ఆప్షన్ ఇచ్చింది. రూ.1000 ఆలస్య రుసుము కట్టడానికి ముందు, AY 2024-25ని ఎంచుకోవాలి.

ఆ తర్వాత, ‘ Other Receipts’ను (ఇతర రసీదులు) డిపాజిట్ టైప్ను ఎంచుకోవాలి. ఇప్పుడు డబ్బు చెల్లించాలి. గత డెడ్‌లైన్ అయిన 2023 మార్చి 31వ తేదీకి ముందు అసెస్‌మెంట్ ఇయర్ AY 2023-24గా ఉంది.

కొత్త గడువైన జూన్ 30వ తేదీ లోగా పాన్ కార్డ్‌హోల్డర్ తన ఆధార్‌ను లింక్ చేయకపోతే, సంబంధిత వ్యక్తికి చెందిన పాన్ కార్డ్ నిష్క్రియంగా (నాన్-ఆపరేటివ్) మారుతుంది. ఈ గడువు తర్వాత రూ. 10,000 ఫైన్ చెల్లించాల్సి వస్తుంది.

 

SMS ద్వారా పన్ను ఆధార్తో ఎలా లింక్ చేయాలి?

 

1. మీ రిజిస్టర్డ్ మొబైల్‌లో ‘UIDPAN < 12 అంకెల ఆధార్ సంఖ్య > < 10 అంకెల పాన్ >’ అని టైప్ చేయండి

 

2. ఆ సందేశాన్ని 56161 లేదా 567678కి ఈ SMS చేయండి.

 

ఇప్పటికే పాన్-ఆధార్ లింక్ చేస్తే, దాని స్థితిని ఎలా తనిఖీ చేయాలి?

 

1. ఆదాయ పన్ను విభాగం అధికారిక పోర్టల్ www.incometax.gov.in/iec/foportal లో సైన్ ఇన్ చేయకుండానే పాన్-ఆధార్ లింక్ స్థితిని తనిఖీ చేయవచ్చు.

 

2. ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీలో, ‘క్విక్ లింక్స్’ పట్టీకి, ‘లింక్ ఆధార్ స్టేటస్’ మీద క్లిక్ చేయండి.

 

3. మీ పాన్, ఆధార్ నంబర్లను సంబంధిత గడుల్లో నమోదు చేసి, ‘లింక్డ్ ఆధార్ స్థితిని వీక్షించండి’ మీద క్లిక్ చేయండి. ధృవీకరణ విజయవంతం కాగానే, పాన్-ఆధార్ అనుసంధాన స్థితి తెరపై కనిపిస్తుంది.

 

పాన్-ఆధార్ లింక్ చేయకపోతే ఏంటి నష్టం? 

 

కొత్త గడువులోగా కూడా పాన్-ఆధార్ లింక్ చేయని పన్ను చెల్లింపుదారులకు రిఫండ్ రాదు. PAN పని చేయని కాలానికి రిఫండ్‌పై వడ్డీ చెల్లించారు. అటువంటి చెల్లింపుదార్ల నుండి ఎక్కువ మొత్తంలో TDS, TCS వసూలు చేస్తారు. పాన్ తో ఆధార్ లింక్ చేసి, రూ. 1,000 చెల్లించిన తర్వాత, 30 రోజుల్లో పాన్ మళ్లీ చురుకుగా మారుతుంది. ఇప్పటి వరకు 51 కోట్లకు పైగా పాన్లను ఆధార్ నంబర్లతో అనుసంధానం చేసినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ.