మీ ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకోవడం ఎలా …❓

Posted by

 

ఆధార్ కార్డు ప్రతి భారతీయ పౌరుడికి ఒక ఐడెంటిటి. అది లేకపోతే మన దేశంలో మనుగడ సాధించడం కష్టం అన్నింటికీ ఆధారం బ్యాంకు ఖాతా తెరవాలన్నా కేవైసీ పూర్తి చేయాలన్నా, రేషన్ కార్డు కావాలన్నా, డ్రైవింగ్ లైసెన్స్ పొందేందుకు, లేదా ఏదైనా ప్రభుత్వ పథకం స్వీకరించడానికి ఇలా ఏదైనా ఆధార్ కార్డు ఉండాల్సిందే. అలాగే మీరూ రోజూ వినియోగించే సిమ్‌ కార్డుకు ఆధార్‌ ఉండాల్సిందే. ప్రూఫ్ కింద ఆధార్‌ చూపిస్తేనే సిమ్‌ కార్డు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది.

 

ప్రూఫ్ కింద ఆధార్‌ చూపిస్తేనే సిమ్‌ కార్డు తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఒక ఆధార్‌పై ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు. అసలు అలాంటి పరిమితి ఏదైనా ఉందా …❓ ప్రభుత్వ నిబంధనలు ఏం చెబుతున్నాయి? మీ ఆధార్ నంబర్‌తో ఎవరైనా దొంగతనంగా సిమ్‌ వినియోగిస్తే …❓ అప్పుడు ఏం చేయాలి …❓ఇలాంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.

 

ఒక ఆధార్ నంబర్ మీద ఎన్ని సిమ్ కార్డులు తీసుకోవచ్చు అనే అంశంలో చాలా మందికి అనేక సందేహాలు ఉంటాయి. అయితే టెలికాం డిపార్ట్‌మెంట్ విధించిన నిబంధనల ప్రకారం ఒక ఆధార్ నంబర్‌పై మొత్తం 9 సిమ్ కార్డులను తీసుకునే అవకాశం ఉంది. అవన్నీ ఒకే ఆపరేటర్‌ నుంచే తీసుకోవాల్సిన అవసరం లేకుండా ఇతర ఆపరేటర్ల నుంచి కూడా తీసుకోవచ్చు.అందువల్ల ఒకే ఆధార్ నంబర్‌పై అనేక సిమ్ కార్డులు తీసుకొంటూ ఉంటారు. సాధారణంగా ఉమ్మడి కుటుంబాలలో ఒకే వ్యక్తి ఆధార్‌పై అందరికీ సిమ్‌లు తీసుకొని వివిధ వ్యక్తులు వినియోగిస్తారు.

 

అయితే ఒకే ఆధార్ నంబర్‌పై పలు రకాల సిమ్‌లు తీసుకొనే వీలైతే ఆ సిమ్ కార్డులు దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఆ సిమ్‌ కార్డు ద్వారా నేరగాళ్లు సైబర్‌ నేరాలకు అవకాశం ఉంది. అటువంటి సమయంలో ఏం చేయాలి …❓దానికి కూడా ప్రభుత్వం ఓ పరిష్కారాన్ని అందిస్తోంది. ఎవరైనా మీ ఆధార్‌తో లింక్ చేయబడిన సిమ్‌కార్డ్‌ని ఉపయోగించారా అని మీరు తెలుసుకునే వీలుంది. అదనంగా ఆ నంబర్‌ను శాశ్వతంగా బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంది.

 

ఇందు కోసం ప్రభుత్వం ఓ ప్రత్యేకమైన పోర్టల్‌ను రూపొందించింది. దీని గురించి చాలా మందికి తెలిస్తే. కానీ తెలియని వారు కూడా చాలా మందే ఉన్నారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (DoT) దీని కోసం కొత్త వెబ్‌పేజీని అందుబాటులోకి తెచ్చింది. అదే http://tafcop.dgtelecom.gov.in పోర్టల్ ఎవరైనా తమ ఆధార్ కార్డు ద్వారా ఎన్ని సిమ్ కార్డులు వాడుకలో ఉన్నాయో తెలుసుకోవాలంటే ఈ పోర్టల్ ద్వారా తెలుసుకోవచ్చు. ఒక వేళ మీరు వాడని సిమ్కార్డులు ఉంటే వెంటనే బ్లాక్ చేసుకోవచ్చు. మరి మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ముందుగా మీరు https://tafcop.dgtelecom.gov.in/ లోకి వెళ్లాలి. తర్వాత అక్కడ మీ మొబైల్ నంబర్‌ను ఎంటర్ చేయాలి. తర్వాత ఓటీపీ వస్తుంది. దానిని నమోదు చేసిన తర్వాత ‘యాక్షన్’ బటన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత పోర్టల్ ఓపెన్ అవుతుంది. అందులో మీ పేరుపై ఉన్న సిమ్ కార్డులు ఎన్ని ఉన్నాయో స్క్రీన్‌పై కనిపిస్తాయి. ఓటీపీని నమోదు చేసిన తర్వాత, మీరు ‘యాక్షన్’ బటన్‌పై క్లిక్ చేయాలి. అందులో మీరు వాడని నంబర్‌ ఏదైనా కనిపిస్తే వెంటనే బ్లాక్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది.