ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి.

Posted by

ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందా లేదా …❓ఇలా చెక్ చేసుకోండి.

దేశంలో ఏడు దశల్లో జరుగుతున్న ఎన్నికల్లో నాలుగో దశలో ఆంధ్రప్రదేశ్ ఎన్నికలున్నాయి. ఏపీ ఎన్నికలకు ఏప్రిల్ 20వ తేదీ నోటిఫికేషన్ వెలువడనుండగా ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు.

 

మే 13న 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. జూన్ 4న కౌంటింగ్ ఉంటుంది. మరి మీ ఓటు హక్కు ఉందా లేదా, ఓటరు జాబితాలో ఎలా చెక్ చేసుకోవాలంటే వివరాలు తెలుసుకుందాం.

 

ఓటరు జాబితాలో మీ పేరు చెక్ చేసుకోవడం చాలా సులభం. ముందుగా.

 

https://electoralsearch.eci.gov.in ఓపెన్ చేయాలి. ఇప్పుడు మీ పేరు సెర్చ్ చేయడానికి మీడు మూడు ఆప్షన్లు కన్పిస్తున్నాయి. EPIC ID లేదా మొబైల్ నంబర్ లేదా ఇతర వివరాలను సమర్పించడం ద్వారా సెర్చ్ చేయవచ్చు. మొబైల్ ద్వారా అయితే ఓటీపీతో నెంబర్ ధృవీకరించుకోవాలి.

 

ఇతర వివరాలంటే మీ పేరు, తండ్రి పేరు, పుట్టిన తేదీ, వయస్సు, జెండర్, రాష్ట్రం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గాలు ఫిల్ చేయాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి క్లిక్ చేస్తే చాలు..జాబితాలో మీ పేరుంటే అక్కడ పోలింగ్ బూత్, అడ్రస్, సీరియల్ నెంబర్ తో సహా వివరాలు తెలియజేస్తాయి.

 

EPIC IDతో చెక్ చేయాలంటే సంబంధిత ఆప్షన్ ఎంచుకుని నెంబర్ ఎంటర్ చేయాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ కొడితే చాలు ఓటరు జాబితాలో మీ పేరుంటే ఆ వివరాల పోలింగ్ స్టేషన్, సీరియల్ నెంబర్ అన్నీ కన్పిస్తున్నాయి.

 

ఇక మొబైల్ నెంబర్‌తో ఓటీపీ నిర్ధారించుకోవాలి. తరువాత క్యాప్చా ఎంటర్ చేసి సెర్చ్ క్లిక్ చేస్తే చాలు అన్ని వివరాలు కన్పిస్తాయి. ఈ మూడు మార్గాల్లో ఎలాగైనా మీ ఓటు ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు. ఆ జాబితాలో మీ పేరు లేకపోతే వెంటనే ఓటరు నమోదు ప్రక్రియ పూర్తి చేసుకోండి. ఏప్రిల్ 15 వరకూ ఏపీలో ఓటర్ల నమోదుకు అవకాశం ఉంటుంది.

 

https://youtu.be/FX-ND0jN8oE

మరిన్నీ న్యూస్ అప్డేట్స్ కోసం మా గ్రూప్ లో జాయిన్ అవ్వండి

https://chat.whatsapp.com/LaLDOwNeMsgDB5BJsq0u1m