- ఇంకొన్ని గంటల్లో భారత్.. నింగిని జయించబోతోంది. చందమామపై త్రివర్ణ పతాకం సగర్వంగా ఎగరబోతోంది. ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్ 3.. నేడు జాబిల్లి మీద అడుగు మోపబోతోంది.ఈ సాయంత్రం సరిగ్గా 6:04 నిమిషాలకు చంద్రుడి దక్షిణ ధృవంలో దిగబోతోంది ఈ మద్య.
ఈ సువర్ణాధ్యాయం కోసం దేశం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తోంది. జాబిల్లి మీద మువ్వన్నెల పతాకం ఎగురుతున్న వీడియో క్లిప్పులు, ఫొటోలు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. అంతరిక్షంపై ఇప్పటికే తన ఆధిపత్యాన్ని చాటుకున్న ఇస్రో.. ఇక చంద్ర మండలాన్ని జయించడాన్ని ఉవ్విళ్లూరుతోంది.
సాఫ్ట్ ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుత మాడ్యూల్ పనితీరును పర్యవేక్షిస్తోన్నారు. ల్యాండింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లకూ అవకాశం ఇవ్వదలచుకోలేదు. 2019లో ప్రయోగించిన చంద్రయాన్ 2 విఫలమైన నేపథ్యంలో.. ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నారు.
నటుడు ప్రకాష్ రాజ్ పై కేసు నమోదు
ట్విట్టర్‌లో ఓ కార్టూన్‌ను పోస్ట్ చేసిన ప్రకాశ్ రాజ్.. ‘బ్రేకింగ్ న్యూస్ చంద్రుడిపై చంద్రయాన్ 3 తీసిన తొలి ఫోటో అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఈ కార్టూన్‌లో ఓ వ్యక్తి లుంగి కట్టుకుని.. టీ పోస్తున్నట్లు ఉంటాడు. ప్రకాశ్ రాజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ షేర్ చేసిన క్షణాల్లోనే వైరల్‌గా మారింది. ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించే ప్రకాశ్ రాజ్ ఈ పోస్ట్ పెట్టారంటూ నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆయనపై మండిపడుతున్నారు.