ఇప్పుడు మరో కొత్త రకం మోసం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు ఇప్పుడు గూగుల్ పే, ఫోన్‌పే వాడే వారే టార్గెట్‌గా పెట్టుకుంటున్నారు. అందువల్ల మీరు గూగుల్ పే, ఫోన్ పే వంటి వాటిని ఉపయోగిస్తూ ఉంటే కచ్చితంగా ఈ విషయం తెలుసుకోవాల్సిందే.
మోసగాళ్లు గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఇతరులకు డబ్బులు పంపిస్తారు. తర్వాత కాల్ చేసి డబ్బులు పొరపాటుగా మీ ఖాతాకు వచ్చాయని చెబుతారు. అటుపైన ఆ డబ్బులు తిరిగి పంపాలని కోరతారు. అంటే మీరు ఆ డబ్బులు తిరిగి వారికి పంపిస్తే.
తర్వాత మీ బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. మోసగాళ్లు వందలు లేదా వేలల్లో డబ్బులు పంపారు. కేవలం రూ.10 లేదా రూ. 50 ఇలా పంపిస్తారు. చిన్న అమౌంట్ కదా అని మీరు తిరిగి వెనక్కి పంపే ఛాన్స్ ఉంటుంది.
పొరపాటుగా వచ్చాయని కాల్ చేస్తారని, ఆ డబ్బులు తిరిగి వెనక్కి పంపాలని కోరతారని వివరించారు. మీరు డబ్బులు వెనక్కి పంపిస్తే.. మీ ఖాతా హ్యాక్ చేస్తారని పేర్కొన్నారు.ఎప్పుడైతే ఫోన్‌పే, గూగుల్ పేసర్లు ఇలా డబ్బులు వెనక్కి పంపిస్తే. వారి డేటా (బ్యాంకింగ్, ఇతర కేవైసీ డాక్యుమెంట్లు (పాన్, ఆధార్ మొత్తం)) మోసగాళ్లకు చేరతాయి.
అప్పుడు ఈ వివరాలతో మోసగాళ్లు ఫోన్‌పే, గూగుల్ పేసర్ల అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారని వివరించారు. అందువల్ల ఫోన్ పే, గూగుల్ పేసర్లు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే వెనక్కి డబ్బులు పంపించకుండా దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు పిలిపించి డబ్బులు ఇవ్వడం బెటర్.
లేదా బ్యాంక్ వెళ్లి ఫిర్యాదు చేయడానికి సూచించండి. ఇలా మీరు సమస్య నుంచి తప్పించుకోవచ్చు. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది.